ఆర్మూర్, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆలూరు మంఢలంలోని కల్లడి గ్రామానికి చెందిన దండుగుల పోశేట్టి ఈ నెల 9న దుబాయిలో ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా నాయకత్వానికి విషయం తెలియడంతో ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించి రూ. 5 వేలు ఆర్థిక సాయం చేశారు.
ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇడగొట్టి సాయిలు చనిపోయిన దండుగుల పోశెట్టి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా మృతుని కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దేరంగుల కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ఇడగొట్టి చిన్న ఒడన్న, జిల్లా సహాయ కార్యదర్శి ఎత్తరి చందర్, జిల్లా కమీటి సభ్యులు గుంజె పాపన్న, ఇడగొట్టి రమేష్, గోగుల ఏల్లయ్య, కంది సాయిలు, ముద్ధంగుల రమేష్, కంది ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.