కామారెడ్డి, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమంను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడలో గురువారం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం ఉందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఈ కార్యక్రమం లేదన్నారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. దృష్టి లోపాలున్న వారికి అవసరాన్ని బట్టి రీడిరగ్ గ్లాసులు అందిస్తారని చెప్పారు.
కంటి వెలుగు కార్యక్రమం సజావుగా చేపట్టేందుకు వైద్యులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. కంటి వెలుగు శిబిరాలకు వచ్చే వారి వివరాల నమోదు, పరీక్షల నిర్వహణ అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమం కంటి వెలుగు అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేసి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, జిల్లా రైతు బంధు కన్వీనర్ అంజిరెడ్డి, ఆర్డీవో రాజా గౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.