ఆర్మూర్, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ సబ్ పోస్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో శుక్రవారం బీపీఎంలు, ఏబీపిఎంలతో సురక్ష మహా లాగిన్ డే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజులు యాక్సిడెంట్ పాలసీలు, హెల్త్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు, బీపీఎంలు, ఏబీపీఎమ్ లు చేయాలని, డైరెక్టరేట్ న్యూఢల్లీి వారి ఆదేశానుసారంగా జిరాయత్ నగర్ సబ్ పోస్ట్ ఆఫీస్ ఎస్పీఎం ఆంజనేయులు కార్యక్రమాన్ని చేపట్టారు.
రెండు రోజులుగా టాటా బజాజ్ పాలసీలు చేయాలని కోరారు. గ్రామాలలో బీవో పరిధిలోని బీపీఎంలు, ఏబీపీఎంలు పది నుండి 20 వరకు రెండు రోజుల్లో తప్పనిసరిగా చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ఎస్ఎస్పిఎం, అధికారులు, ఏఎస్పీల ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూర్ జిరాత్ నగర్ ఎస్పీఎం ఆంజనేయులు ఒక ప్రకటనలో కోరారు.