కామారెడ్డి, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల పిజేఆర్ డిగ్రీ కళాశాలలో టాస్క్ ట్రైనింగ్ క్లాసెస్‌ను కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ గురువేందర్ రెడ్డి ప్రారంభించారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ టాస్క్ తరగతులను ఉపయోగించుకుని విద్యార్థులు తమ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధి రఘు తేజని కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ గౌడ్ సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ గౌడ్, టిపిఓ సందీప్ రెడ్డి, టాస్క్ ట్రైనర్ రవగుతేజ, కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.