నిజామాబాద్, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నిజామాబాద్ యూనిట్ యొక్క కాలమానిని డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతుల యొక్క శ్రేయస్సు కొరకు పాటుపడాలని కోరారు.
కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ మహేందర్ రెడ్డి, ట్రెజరర్ నాగేష్ రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, టెక్నికల్ వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.