మాక్లూర్, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం గుంజిలిలో టిఆర్ఎస్ యువజన నాయకుడు గోపు రంజిత్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రైతు బీమా, సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన మహిళా రైతు దుమాల గంగుబాయి ఇటీవల మరణించింది. ఆమె కుటుంబ సభ్యులకు మంజూరైన రూ.5 లక్షల రైతుబీమా చెక్కు అందించారు.
అలాగే అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న ఖాసీంబీకి సీఎంఆర్ఎఫ్ కింద రూ.20 వేలు మంజూరవగా ఆ చెక్కు అందజేశారు. మహిళ రైతు మరణించడంతో తమ కుటుంబానికి కేసీఆర్ రైతు భీమా ద్వారా ఎంతో మేలు జరుగుతుందని వారన్నారు. అనంతరం కెసిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేస్తున్న సేవలను కొనియాడారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండే ప్రజా నాయకుడని ప్రజా సంక్షేమానికి పాటుపడే నాయకుడు జీవన్ రెడ్డి అని వారన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేఖర్ సీనియర్ నాయకులు, తదితరులున్నారు.