కామారెడ్డి, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రాన్ని అంధత్వ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉన్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. ఏర్పాటుచేసిన కౌంటర్లను పరిశీలించారు.
ఎంతమందికి ఇప్పటివరకు స్క్రీనింగ్ చేశారని వివరాలు అడిగారు. రీడిరగ్ అద్దాలను ఎంతమందికి అందజేశారని వివరాలు అరా తీశారు. శిబిరం ఆవశ్యకత గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు శిబిరానికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చూడాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉన్నారు.