కామారెడ్డి, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని 526 గ్రామపంచాయతీలో మార్చి 15లోగా 100 శాతం ఇంటి పన్నులను వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు అన్నారు. పంచాయతీ కార్యదర్శులు పన్నులను వసూలు చేసే విధంగా మండల స్థాయిలో ఎంపీవోలు, డివిజన్ స్థాయిలో డిఎల్పిఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు.
మండల స్థాయిలో ఎంపీవోల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకొని పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్ల లక్ష్యాలను పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు.