కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి

నిజామాబాద్‌, జనవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు కార్యలయంలో గల నూతనంగా ఏర్పాట్లు చేస్తున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాట్లను శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్య వహారాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్లో అదునాతన టెక్నాలజిని ఉపయోగించి సి.సి టి.వి కెమెరాల అనుసంధానంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరుగకుండా (పసికట్టేందుకు) ఏర్పాట్లు చేస్తున్న పోలీస్‌ కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజుని అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటి కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ వి. అరవింద్‌ బాబు, నిజామాబాద్‌ ఎ.సి.పి ఎ. వెంకటేశ్వర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎ.సి.పి జి. మధుసుదన్‌ రావు, ఐ.టి కోర్‌ ఇన్స్పెక్టర్‌ ముఖీద్‌ పాషా సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »