హైదరాబాద్, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదింటి ఆడ పిల్లల పెళ్లికి ప్రభుత్వం అందించే కల్యాణ లక్ష్మి పథకంలో దరఖాస్తుల పరిశీలన అధికారాన్ని మహిళా-శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో ఉన్న ఛైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్‌కు అప్పగించారు.
కల్యాణ లక్ష్మి పథకం దరఖాస్తుల పరిశీలన అధికారం ఇప్పటి వరకు తహసీల్దార్లకు ఉంది. 20 మార్చి 2012న జారీ చేసిన జీవో 14లో ఉన్న నిబంధనను మార్చి ఆ స్థానంలో చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారిగా పేర్కొంటూ సవరణ ఉత్తర్వులను మహిళా-శిశుసంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి.దివ్య జారీ చేశారు.