నిజామాబాద్, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఆదివారం జరుగనున్న రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 10 నుండి 12.30 గంటల వరకు జరిగే పేపర్-1 పరీక్షకు సంబంధించి అభ్యర్థులను ఉదయం 8.30 నుండి 9.45 గంటల వరకు లోనికి అనుమతిస్తారని, ఆ తరువాత వచ్చే వారు అనుమతించబడరని అన్నారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే పేపర్-2 పరీక్షకు గాను మధ్యాహ్నం 1.30 నుండి 2.15 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రం లోనికి అనుమతిస్తారని అన్నారు. కావున అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ వెంట సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వెంట తేకూడదని తెలిపారు.