రెంజల్, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల పెన్నిధి ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సర్పంచ్ రమేష్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన జబ్బర్ ఖాన్కు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన రూ.36 వేలు, బి. సత్తెవ్వకు రూ.14 వేలు, మహ్మద్ ఉస్మాన్ కు రూ.11 వేల చెక్కును అందజేశారు.
అనారోగ్యానికి గురైన బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిది ద్వారా ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత సీఎం సహాయ నిధి ద్వారా చెక్కును మంజూరు చేయడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రఫిక్, సిగ్గు వెంకట్, నారాయణ, సమీ తదితరులు ఉన్నారు.