కామారెడ్డి, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బస్టాండ్ సమీపంలో ప్రైవేటు వాహనాలు నిలుపకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఆర్టీసీ, ఆర్టీవో, పోలీస్ అధికారులతో ఆర్టీసీ ఆదాయం పెంపుపై సమీక్ష నిర్వహించారు. ప్రతి సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు ప్రైవేటు వాహనాలు నిలుపకుండా అధికారులు తనిఖీలు చేపట్టాలని సూచించారు.
బిచ్కుంద, పిట్లం, లింగంపేట బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆర్టీసీ, ఎంవీఐ, పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఆర్టీసీ ఆదాయం పెంపునకు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఆర్టీవో వాణి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఉషాదేవి, కామారెడ్డి, బాన్సువాడ ఆర్టీసీ డిఎం లు మల్లేశం, సదాశివ్, అధికారులు పాల్గొన్నారు.