నిజామాబాద్, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును టిఎస్ ఆర్టిసి చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్థన్ మంగళవారం జక్రాన్‌పల్లి గ్రామానికి చెందిన పి. గంగు (మహేందర్ భార్య) కి రూ. ఒక లక్ష చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) పథకం ఒక వరమని అన్నారు.
ఆపదలో ఉన్న అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్ధిక భరోసా కల్పిస్తోందని అన్నారు. బాధితులు సీఎంఆర్‌ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు.