కామారెడ్డి, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ముఖద్వారానికి ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా 1 లక్ష 50 వేల రూపాయలను మంగళవారం హైదరాబాదులోని తన నివాసంలో ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా, వాసవి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మాది మాజీ అధ్యక్షుడు యాద నాగేశ్వరరావు గుప్తా, పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ గుప్తా, ప్రధాన కార్యదర్శి మొగిలిపల్లి భూమేష్ గుప్తాకు అందజేశారు.
కన్యకా పరమేశ్వరి ఆలయ ముఖద్వారానికి నిధులు కావాలని కామారెడ్డి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు విశ్వనాథుల మహేష్ గుప్త అడగగానే వెంటనే స్పందించి విరాళాన్ని అందజేసినందుకు కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్యులు అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ అధ్యక్షుడు డాక్టర్ బాలు, అడ్లూర్ ఎల్లారెడ్డి ఉప సర్పంచ్ చింతల లక్ష్మీపతి పాల్గొన్నారు.