ప్రమాదవశాత్తు కిరాణా దుకాణం దగ్ధం

కమ్మర్‌పల్లి, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి కిరాణా షాపు దగ్ధమైన ఘటన కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

కోనాపూర్‌ గ్రామానికి చెందిన మ్యాకల శంకర్‌ మంగళవారం రోజున ప్రతిరోజులాగే రాత్రి సుమారు 8 గంటల సమయంలో కిరాణా షాపు మూసివేసి ఇంటికి వెళ్ళాడు. రాత్రి 1:30 గంటల సమయంలో కిరాణా దుకాణంలో షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యి మంటలు ఎగిసి పడడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు శంకర్‌ ఇంటికి వెళ్లి సమాచారం అందించారు.

అనంతరం శంకర్‌ వచ్చి చూడడంతో పూర్తిగా దగ్ధం అయిన కిరాణ షాపును చూసి కన్నీటి పర్వంతం అయ్యాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. 1 లక్ష 30 వేల నగదు, 90 వేలు విలువగల కిరాణా సరుకులు, ఫ్రిజ్‌ పూర్తిగా కాలిపోయి ధ్వంసం కావడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతోనే ఇలా జరిగిందా లేదంటే వ్యక్తిగతంగా ఎవరైనా ధ్వంసం చేశారా అనేదానిపై విచారణ జరిపి తనను ఆదుకోవాలని వేడుకున్నాడు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »