నిజామాబాద్, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కార్పొరేటర్లతో కలిసి నగర మేయర్ దండు నీతూకిరణ్ పాల్గొన్నారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ దదన్న గారి విట్టల్ రావ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు
అలాగే నుడా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్‌లతో కలిసి పాల్గొన్నారు. గూడ్స్ టాటా ఏస్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ మన దేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్రం సాధించిన తరువాత మన పరిపాల మన సామజిక, ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా దేశంలోని అందరూ ప్రజలకు కావాల్సిన అన్ని హక్కులను, విధులను కలిపిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాని రచించి కుల, మత, ధనిక, పెద్ద వర్ణ వ్యవస్థలకు అతీతంగా దేశ ప్రతి పౌరుడికి సమానమైన హక్కులను అందించారని గుర్తు చేసారు.