కామారెడ్డి, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహనీయులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. జిల్లా అభివృద్ధికి అధికారులు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. జిల్లా అధికారులకు, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ శోభ, వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కారం చేయాలని తెలిపారు. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి బి, సాయిలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.