కామారెడ్డి, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిరుధాన్యాలు వినియోగిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్ యార్డ్ ఆవరణలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 సందర్భంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. చిరుధాన్యాలు ప్రజలు తీసుకోవడం వల్ల పౌష్టికాహారం అందుతుందని తెలిపారు.
చిరుధాన్యాలు తీసుకుంటే వ్యాధులు రావని చెప్పారు. జొన్నలు, సామలు, సజ్జలు, రాగులు రైతులు పండిరచే విధంగా వ్యవసాయ అధికారులు, విస్తీర్ణ అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. చిరుధాన్యాలతో తయారుచేసిన పిండివంటలను కలెక్టర్ పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. చిరుధాన్యాలతో పిండివంటలు తయారుచేసిన వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకటి, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, వ్యవసాయ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.