కామారెడ్డి, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు శిబిరాన్ని పోలీసులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
కంటి సమస్య ఉన్నవారు ఈ శిబిరం ద్వారా కంటి అద్దాలు, మందులు ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అన్యోన్య కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆయన కు కంటి అద్దాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అందజేశారు. కార్యక్రమంలో నేత్ర వైద్యులు, పోలీసులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.