ఆర్మూర్, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తపాలా శాఖలో కొత్త వడ్డీ రేట్ల తో ఈ నెల 28 న అన్ని పోస్టల్ బ్రాంచ్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తపాల శాఖ సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ తెలిపారు. సురేఖ మాట్లాడుతూ… నిత్యం ప్రజలకు సేవలు అందించే తపాలా శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించిందని, పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచిందని, 28 జనవరి నుండి మార్చి 31 వరకు ఈ వడ్డీ రేట్లు వర్తించనున్నాయన్నారు.
కొత్తవడ్డీ రేట్లతో ఈ నెల 28 నుండి 30 వరకు నిజామాబాద్ , కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని అన్ని తపాల కార్యాలయాలలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని, తపాలా అసిస్టెంట్ సూపరింటెండెంట్ యాపరు సురేఖ తెలిపారు. 28 న దేశవ్యాప్తంగా కొటి ఖాతాలు ‘‘ఏక్ దిన్ మే ఏక్ క్రోడ్ ‘‘ అనే నినాదంతో ఉద్యోగులు ప్రజల ముందుకు వస్తున్నారని, 28 నాడు ప్రజలందరూ మీకు దగ్గరలోని పోస్ట్ ఆఫీసుల్లో కొత్త వడ్డీ రేట్లతో ఏదైనా ఒక ఖాతా తెరిచి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఏఎస్పీ సురేఖ కోరారు.