కామరెడ్డి, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కరక్ వాడి గ్రామానికి చెందిన సౌందర్య (30) కి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ పిఆర్ బిసి రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని చంద్రకాంత్ బూర్గుల్ గాంధారి సహకారంతో కేబీసీ బ్లడ్ బ్యాంకులో అందజేసినట్టు పేర్కొన్నారు.
రక్తదానం చేసిన రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి కావలసిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని, రక్తదానం పట్ల అపోహలను విడనాడి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు.
కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు,డివిజన్ సెక్రటరీ జమీల్, రాజంపేట మండల రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ప్రసాద్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు జీవన్, సంతోష్ పాల్గొన్నారు.