బాన్సువాడ, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం నుండి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి శివ దీక్ష స్వాములు పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు. 41 రోజులు మండలం దీక్షలు తీసుకున్న స్వాములు మాఘమాసంలో దీక్ష విరమణ చేసుకుంటారు.
బాన్సువాడలో ఇరుముడి కట్టుకొని దీక్ష స్వాములు పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధిలో ఇరుముడి చెల్లింపు చేసుకొని శివరాత్రి రోజు మాల విరమణ చేస్తారు. పాదయాత్ర 11 రోజులకు శ్రీశైలంకు చేరుకోనుంది. పాదయాత్ర లో 40 మంది దీక్ష స్వాములు, మహిళలు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్ని పాద యాత్రగా బయలుదేరారు.