కామారెడ్డి, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో మన ఊరు – మన బడి, ఉపాధ్యాయుల బదిలీలు అంశంపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పదోన్నతుల, బదిలీల జాబితాలు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో మన ఊరు- మనబడి కింద 13 పాఠశాలలు ప్రారంభానికి సిద్ధమైనట్లు తెలిపారు. ఉపాధ్యాయుల పదోన్నతుల జాబితా సిద్ధమైనట్లు చెప్పారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కరుణ, డైరెక్టర్ దేవసేన, డిఈఓ రాజు, సమన్వయకర్తలు శ్రీపతి, గంగా కిషన్, మనోహర్, వేణుగోపాల్ పాల్గొన్నారు.