చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌గా రాజ్‌కుమార్‌ సుబేదార్‌

నిజామాబాద్‌, జనవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది రాజ్‌ కుమార్‌ సుబేదార్‌ను నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ లో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌గా నియమిస్తు తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లా న్యాయసేవ సంస్థ చైర్‌ పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆయనకు జిల్లా సంస్థ తరపున నియమాక పత్రాన్ని అందజేశారు.

జిల్లా న్యాయసేవ సంస్థ సభ్యుడిగా సంస్థ ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాన్‌ ఇండియా లీగల్‌ అవెర్‌ నెస్‌ కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించారు. పలు సామాజిక సేవలలో తనదైన ముద్ర వేశారు. నిజామాబాద్‌ బార్‌ అధ్యక్షుడుగా పనిచేశారు. సుబేదార్‌ నియమాకం పట్ల బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు రాజేందర్‌ రెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు కృపాకర్‌ రెడ్డి, రాజేశ్వర్‌ రెడ్డి, జె.వెంకటేశ్వర్‌, దాసరి పుష్యమిత్ర, ఎన్‌. సంతోష్‌, మంచికట్ల గోవర్ధన్‌ అభినందనలు తెలిపారు.

న్యాయసేవ సంస్థ ఉన్నతికి, నేర విచారణలో ఉన్న జైలు ఖైదీలకు సత్వర న్యాయానికి అవకాశం ఉంటుందని వారు అన్నారు. అలాగే డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌గా న్యాయవాది ఉదయ కృష్ణ, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌గా న్యాయవాదులు శుభం, ప్రమోద్‌ లను నియమించారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »