కామారెడ్డి, జనవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో అధిక మొత్తంలో పరీక్ష ఫీజులను వసూలు చేస్తున్నారని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ బాన్సువాడ, ఎల్లారెడ్డి ఇంచార్జ్ దుంపల తుకారం ఆధ్వర్యంలో పట్టణంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జామ్ ఫీజు అంటూ, ప్రాసెసింగ్ ఫీజు అంటూ, బయోమెట్రిక్ ఫీజు అంటూ, మైగ్రేషన్ ఫీజు అంటూ ఇలా యూనివర్సిటీ ఇష్టం వచ్చినట్టుగా విద్యార్థుల పైన అధిక మొత్తంలో పీజుల భారం మోపుతూ వస్తుందన్నారు.
ఫీజులను వెంటనే తగ్గించాలని టిజివీపీ డిమాండ్ చేస్తుందని, లేని పక్షాన పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామన్నారు. యూనివర్సిటీ ముట్టడిరచడానికి కూడా సంకోచించమన్నారు.