ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

బోధన్‌, జనవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీలో నివసించే ముఖేడ్‌ రాములు (42) ఈ నెల 25 రాత్రి దామర చెరువులో చేపల వల వేయడానికి వెళ్లి తిరిగి రాలేదు. కాగా శనివారం ఉదయం శవమై కనిపించాడు.

కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కూలీ పని చేసుకుని జీవించే రాములు అప్పుడప్పుడు ఇంట్లో వండుకోవడానికి తన ఇంటి సమీపంలోని దామర చెరువులో చేపల వేటకు వెళ్తాడు. ఎప్పటిలాగే రాత్రి వేళ చేపల వల వేయడానికి చెరువులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు గతంలో పూడిక తీసిన ఓ లోతైన గుంతలో మునిగి పోయి ఊపిరాడక మృతిచెందాడు. మృతుడికి ఈత రాదు.

శనివారం ఉదయం శవమై తేలడంతో ఈ దుర్ఘటన బయటకు పొక్కింది. ఇతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కోటగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలాన్ని సందర్శించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »