రెంజల్, జనవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోర్గం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో శనివారం మధ్యాహ్నం భోజనాన్ని వైస్ ఎంపీపీ యోగేష్ పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు.
ఉపాధ్యాయుల బోధన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కార దిశగా కృషి చేస్తామని ఆయన అన్నారు కార్యక్రమంలో ఎంఈఓ గణేష్ రావు, ఉపసర్పంచ్ ఫెరోజ్, మేక సంతోష్ తదితరులు ఉన్నారు.