హైదరాబాద్, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని కొండాపూర్ లోని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) గ్రీన్ బిల్డింగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఐఐ చైర్మన్ సమీర్ గోయల్‌తో కలిసి ఆసనాలు వేశారు.
కార్యక్రమంలో సిఐఐ టూరిజం వింగ్ కన్వీనర్ ఆనందిత, జయ భారతి, యోగ గురువు హర్షిత, సిఐఐ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.