కామారెడ్డి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జయశంకర్ ఆలోచనలే అన్ని అడ్డంకులు దాటుకుని మలిదశ పోరాటానికి పునాది వేశాయని, ఆధునిక తెలంగాణ చరిత్రలో ఎప్పటికి యాది మరవని మహనీయుడు జయశంకర్ అని, ఆయన ఆశయాలు నెరవేర్చే బాధ్యత మనందరి ముందు ఉందని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు, ప్రముఖ కవి, రచయిత, గాయకులు గఫుర్ శిక్షక్ అన్నారు.
ఈ సందర్భంగా గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రమే తన శ్వాసగా భావించి ఉద్యమ పాటను యుద్ధక్షేత్రంలో ముందువరుసలో నిలిపిన ప్రజా రచయిత గూడ అంజయ్య అని, నేడు ప్రజరచయితలు సమాజానికి అవసరమని ప్రజా సమస్యలకు పరిష్కార దిశలో రచనలు అవసరమని అన్నారు.
కార్యక్రమంలో గూడ అంజయ్య రాసిన ప్రజా పాటలను రచయితలు పాడారు. జయశంకర్ యాదిలో ఆయన ఆశయాలను సాధించాలని ప్రతిజ్ఞచేశారు.
కార్యక్రమంలో తెరవే ఉపాధ్యక్షులు మంద పీతాంబర్, ఎనిశెట్టి గంగా ప్రసాద్, బి.నాగ భూషణం, తెరవే జిల్లాకార్యదర్శులు వైద్య శేషారావు, కౌడి రవీందర్, చంద్రకాంత్, రమేష్ చైతన్య, నవీన్ రెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.