కామారెడ్డి, ఫిబ్రవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం సురాయిపల్లి గ్రామానికి చెందిన నూర్ సింగ్ అనీమియా వ్యాధితో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో బాధపడుతుండడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
లింగంపల్లి గ్రామ సర్పంచ్ బండి రాజయ్య ఏ పాజిటివ్ రక్తాన్ని వి.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో సకాలంలో అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు పుట్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామన్నారు.
మానవతా దృక్పథంతో స్పందించినప్పుడే సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడగలుగుతామన్నారు రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత బండి రాజయ్య కు తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు మరియు కలెక్టర్ జిల్లా అధ్యక్షుడు జితేష్ వి పాటిల్ తరపున అభినందనలు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో రక్తం లభించినట్లయితే 9492874006 నెంబర్ కి సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో రాజు, టెక్నీషియన్లు చందన్, ఏసు గౌడ్, కిషోర్ పాల్గొన్నారు.