కామారెడ్డి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు అభ్యర్థుల ఎంపికలలో నిరుపేద దళితులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిరచారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద దళిత కుటుంబాలకు మొదటగా ప్రాధాన్యతగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధు ప్రక్రియలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలని, జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపిక జిల్లా కలెక్టర్ ద్వారా జరపాలని, ప్రభుత్వ అధికారుల చేత లబ్ధిదారులను ఎంపిక చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దళిత బంధు పథకంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు, దళిత బంద్ పథకంలో ఆన్లైన్ ప్రక్రియ మండలాల్లో గ్రామాల్లో కల్పించాలని కోరారు ఎలాంటి లోను తీసుకొని వారికి మొదటిగా ఇవ్వాలని ఈనెల 14 తేదీన ఇంద్ర పార్కులో లక్ష మందితో ధర్నా చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పొట్టిగిని శంకర్, జిల్లా అధ్యక్షులు రుసేగం భూమయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపతి, అధికార ప్రతినిధి రామస్వామి, చందు, శంకర్, యాదవరావు, మారుతి, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.