నిజామాబాద్, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పాపని దత్తత ఇవ్వడం జరిగింది. సోమవారం స్థానిక ఐడిఓసిలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ఐదు సంవత్సరాల పాపని జర్మనీ దేశానికి సంబంధించిన తల్లిదండ్రులకి దత్తత ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్న భార్యాభర్తలని అభినందించారు. పాపని జాగ్రత్తగా చూసుకోవాలని మంచి పౌష్టికాహారం, విద్య అందించాలని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, బాల రక్షాభవన్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్, శిశు గృహ మేనేజర్ అనిత సిబ్బంది పాల్గొన్నారు.