ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. మొత్తం 70 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో జెడ్పి సీఈవో సాయ గౌడ్‌, ఏవో రవీందర్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »