ఆర్మూర్, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ డివిజన్లోని ప్రజలకు తాను తనువు చాలించే వరకు చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా వైద్య సేవలు అందిస్తానని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎంజీ ఆస్పత్రి అధినేత డాక్టర్ బద్ధం మధు శేఖర్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పెర్కిట్‌లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత తెలుగు మీడియం పాఠశాల ఆవరణలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో 42వ ఉచిత సర్జికల్ క్యాంపు, మల్టీ స్పెషాలిటీ హెల్త్ చెకప్ మెగా క్యాంప్ ఆదివారం ఘనంగా నిర్వహించారు.
హెల్త్ క్యాంపు లో 2005 ఓపి. మొత్తం 46 ఆపరేషన్ లు. అందులో 4 హైడ్రో సీల్. 42 కంతి. గడ్డల ఆపరేషన్‌లు నిర్వహించారు. ఆర్మూర్ డివిజన్లోని ప్రజలకు తాను తనువు చాలించే వరకు చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా వైద్య సేవలు అందిస్తానని అయన అన్నారు.
మెగా క్యాంపు శిబిరానికి సహకారం అందించిన పెర్కిట్, కోటర్ముర్ గ్రామ అభివృద్ధి కమిటీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ క్యాంపు డాక్టర్లు నంధిత రమాదేవి, నాగరాజ్, గంగ ఆసుపత్రి అధినేత ఏలేటి అమృత రాంరెడ్డి, వసంత జ్యోతి, లింగారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్వేతా, శృతి, శ్రీలత, సుజాత, బాల్ రెడ్డి, పద్మ రెడ్డి తదితరులున్నారు.