కామారెడ్డి, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాలంగా గత 21 సంవత్సరాల క్రితం గంగపుత్ర కుల పెద్దలు గంగామాత ఆలయాన్ని నిర్మించుకుని శ్రీ గంగామాత విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారు. మూడు రోజుల పాటు శ్రీ గంగామాత ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం మాదిరిగా 21 వ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం కూడా మూడు రోజుల పాటు శనివారం విఘ్నేశ్వరపూజ, పూజ, మహిలతో గ్రామదేవతల భోనాలతో మ్రొక్కులు తీర్చుకున్నారు.
అమ్మవారి అభిషేకాలు, అఖండ దీపారాధన, స్వస్తి పుణ్యహావాచనములో దంపతులు, ధ్వజస్తంభారోహన పూజలో పాల్గొన్నారు. చివరిగా సోమవారం ఉదయం 9 గంటలకు పట్టణ గంగాపుత్ర సంఘ భవనం నుండి ఉత్సవ విగ్రహాల రథయాత్ర, వలగొడుగులు, పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో ప్రారంభమై భవానీరోడ్డు, ఇస్లాంపుర, పెద్ద మసీదు, పెద్ద బజార్, రైల్వే బ్రిడ్జి, నిజాంసాగర్ చౌరస్తా, ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్, అనంతసాయి ఫంక్షన్ హాల్ రోడ్ చెఱువు మత్తడి గుండా కామారెడ్డి పెద్ద చెఱువు అలగు ప్రాంతంలో అంగరంగవైభవంగా, దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతో వెలుగుతున్న చూడముచ్చటగా ముస్తాబైన ఆలయానికి చేరుకుని అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పార్వతీ సమేత శివగంగా కళ్యాణ మహోత్సవం, సామూహిక కుంకుమార్చన, అన్నదానం, గంగాతెప్పోత్సవము, గంగా మహామంగళహారతితో 21 వ వార్షికోత్సవ ఉత్సవాలు ముగియుని పట్టణ గంగాపుత్ర సంఘం భవానీరోడ్డు కామారెడ్డి గంగాపుత్రులు తెలిపారు.
భక్తులందరూ బోనాల రోజు గంభీరంగా వున్న అమ్మవారిని దర్షించుకుంటే సకలసౌభాగ్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని యావత్తు గంగాపుత్రుల నమ్మకం. అమ్మవారిని దర్శించుకుని అమ్మ వారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఆదివారం మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబ్బీర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు.
కార్యక్రమంలో ఎఫ్‌సిఎస్ అధ్యక్షులు గాధం లక్ష్మీ నారాయణ, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కాచాపూర్ ఎల్లయ్య, దువ్వల నారాయణ, పాక నారాయణ, భవానీ పేట శ్యామ్ రావు, కొరుపల మహేంధర్, కొరుపల సురేష్, దువ్వల శ్రీనివాస్, దువ్వల రవికాంత్, పంపరి నవీన్, పాక వెంకటి, పంపరి విజయ్ కుమార్, నత్తి నర్సింలు, బింగి శివరాజ్, భక్తులు గంగాపుత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.