బాన్సువాడ, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎస్ఆర్యన్కే డిగ్రీ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి దాసరి వినోద్ కుమార్ అగ్ని వీరుడుగా ఎంపికైనందుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్ అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అగ్నిపత్ ఆర్మీ స్పోల్స్ భాగంగా కళాశాల నుండి విద్యార్థి ఎంపిక అవడం ఎంతో అభినందనీయమన్నారు. చదువుతోపాటు దేశ రక్షణలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్, అధ్యాపకులు విటల్, వెంకట్రావు, శంకర్రావు, శ్రీనివాస్, రాథోడ్ కృష్ణ, రమాదేవి, అనిత తదితరులు పాల్గొన్నారు.