ఎమ్మెల్యేపై దూషణలు ఖండించిన యూత్‌ నాయకులు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే పియుసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి పై సోషల్‌ మీడియాలో వ్యక్తిగతంగా అసభ్య కరమైన పోస్టులు పెట్టిన బిజెపి పార్టీకి చెందిన మల్లెల శ్రీనివాస్‌ రెడ్డి పైన ఆర్మూర్‌ సిఐకి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా యువజన కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం చాలా బాధాకరమని, వారు ఆర్మూర్‌ నియోజవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని అలాగే జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నుండి జిల్లా అభివృద్ధి కూడా ఎంతో కృషి చేస్తున్నారని, ఇలాంటి నాయకుడిపై ఇలాంటి పోస్టులు పెట్టడం చాలా బాధాకరమని అన్నారు.

బిజెపి నాయకులు తమకు చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడం అలాగే ప్రజలకు చెప్పేది ఏమీ లేక ఇలా టిఆర్‌ఎస్‌ నాయకులపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ప్రజలను రెచ్చగొట్టడమే, వ్యక్తిగత దూషణలే లక్ష్యంగా పెట్టుకున్నారని ఇది మంచి రాజకీయం కాదని అన్నారు. ఒక వైపు బిఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధి అయితే ఎంతో సఖ్యతగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడమే బిజెపి లక్ష్యంగా ఒకవైపు నుండి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అన్నారు. ఇకనైనా ఇలాంటి చర్యలు ఆపేయాలని అభివృద్ధి గురించి మాట్లాడాలని తెలిపారు.

కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు జన్నపల్లి రంజిత్‌, టెలికాం డైరెక్టర్‌ షాహిద్‌, ఆర్మూర్‌ పట్టణ యువజన కమిటీ అధ్యక్షుడు గుంజాల పృథ్వీరాజ్‌, ఆర్మూర్‌ మండల యువజన కమిటీ ఉపాధ్యక్షుడు క్రాంతి, జాగృతి ఆర్మూర్‌ నియోజక అధ్యక్షుడు సాయినాథ్‌, జిల్లా యువజన కమిటీ నాయకులు మీరా శ్రావణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »