అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే నోటీసులు

కామారెడ్డి, ఫిబ్రవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో అనుమతి లేకుండా గృహాల నిర్మాణం చేపడితే వారికి పంచాయతీ కార్యదర్శులు నోటీసులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం లేఅవుట్‌ రూల్స్‌, బిల్డింగ్‌ రెగ్యులేషన్స్‌ ఇతర కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీవో లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

అసైన్మెంట్‌, ఫారెస్ట్‌ భూముల్లో గృహాలు నిర్మించడానికి అనుమతి ఇవ్వరాదని తెలిపారు. పౌల్ట్రీ పామ్‌ కు అనుమతి ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పారు. సొంత స్థలంలో గృహాలు నిర్మించుకునే వారికి అనుమతి ఇవ్వాలని సూచించారు. చట్టం ప్రకారం లేఅవుట్‌ రూల్స్‌ పాటించాలని కోరారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు తడి పొడి చెత్తను సేకరించే విధంగా చూడాలన్నారు. సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డ్‌కు తరలించి తడి, పొడి చెత్తను వేరుచేసి తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువులు తయారుచేసి గ్రామాల్లోని రైతులకు విక్రయించి పంచాయతీ ఆదాయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

పొడి చెత్తను విక్రయించి ఆదాయాన్ని రాబట్టాలని కోరారు. గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి భూగర్భ జలాల పెంపునకు అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇంటి పనులు అన్ని గ్రామాల్లో 100 శాతం వసూలు చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే మాట్లాడారు.

జిల్లాలో 146 గ్రామాలు ఓడిఎఫ్‌ ప్లస్‌ లో ఉన్నాయని తెలిపారు. పరిశుభ్రత కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో చేపట్టాలని చెప్పారు. సమావేశంలో జెడ్పి సీఈవో సాయా గౌడ్‌, ఇన్చార్జి డిపిఓ సాయిబాబా, డిటిసిపిఓ నరహరి, డిఎల్పిఓ సురేందర్‌, ఎస్బిఎం సమన్వయకర్తలు మధు కృష్ణ, నారాయణ ఎంపీవోలు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »