నిజామాబాద్, ఫిబ్రవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ప్రతీ సంవత్సరం నిర్వహించే యూత్ పార్లమెంటు పోటీలలో భాగంగా జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన కుమారి అక్షిత, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీలలో ద్వితీయ స్థానంలో నిలిచింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి యువతీయువకులు పాల్గొన్న ఈ పోటీలు ఉత్కంఠగా సాగాయని, ఆ పోటీలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన అక్షిత ద్వితీయ స్థానం సాధించి జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు అర్హత సాధించడం పట్ల నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అక్షితను శైలి బెల్లాల్ ప్రత్యేకంగా అభినందించారు, జాతీయ స్థాయిలో కూడా చక్కని ప్రతిభను చూపాలని,నిజామాబాద్ జిల్లా పేరును దేశవ్యాప్తంగా వినిపించేలా చేయాలని సూచించారు.