నిజామాబాద్, ఫిబ్రవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమ నాయకులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంటు ఈ సంవత్సరం కూడా మీ ముందుకు వస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2021 సంవత్సరంలో ప్రారంభించిన టోర్నమెంటు ఈసారి కూడా పురుషుల, మహిళల విభాగాల్లో జరగనుందని భారత జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతిరావు పేర్కొన్నారు.
ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాల వెల్లడిరచారు.
రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి :
ట్రోఫీ, మెడల్స్, లక్ష రూపాయల నగదు
ద్వితీయ బహుమతి :
ట్రోఫీ, మెడల్స్ 50 వేల రూపాయల నగదు
తృతీయ బహుమతి:
ట్రోఫీ, మెడల్స్ 25 వేల రూపాయల నగదు,
ప్రోత్సాహక బహుమతులు కూడ ఉంటాయన్నారు. అలాగే వివిధ విభాగాల వారీగా ఉత్తమ క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో జిల్లా వాలిబాల్ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లేష్ గౌడ్, జాగృతి నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, నరాల సుధాకర్, సాయికృష్ణ, అనిల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.