కామారెడ్డి, ఫిబ్రవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ప్రాక్టికల్ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. సమావేశంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, జిల్లా పరీక్షల నియంత్రణ కమిటీ ప్రతినిధులు అజ్మాల్ ఖాన్,డి. నిజం, అధికారులు పాల్గొన్నారు.