డిచ్‌పల్లి, ఫిబ్రవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో వ్యవసాయం రంగం కీలకమైనదని దాని మీద ఆధారపడి భూమిని నమ్మిన సన్న చిన్న కారు రైతులు వ్యవసాయం చేస్తున్నపుడు భూమికి ఎపుడు ఏమి కావాలని అడుగుతు సకాలంలో దానికి అవసరం అయినవి అందిస్తూ ఎన్ని ఇబందులు ఉన్న అందులో వచ్చే ఫల సాయంతో బతుకుతున్నారు, అలాంటి వారిని స్వయం సమృద్ధి పరచడం, వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాడడం ఎఫ్‌పివోల లక్షంగా ఉందని జెడిఎ తిరుమల ప్రసాద్ అన్నారు.
ఇలాంటి సంస్థలో రైతులు ఉండి వారి ఆర్థిక అభివృద్ధిని మెరుగు పరుచుకోవాలని కోరారు. సోమవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని కెఎన్‌ఆర్ గార్డెన్‌లో ఇందురు డిచ్‌పల్లి రైతు ఉత్పతి దారుల సంఘం (ఎఫ్‌పివో కంపెనీ, లిమిటెడ్) చైర్మన్ ఎం. నాగయ్య అధ్యక్షతన జెనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జెడిఎ తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ రైతులంతా ఐక్యంగా ఉండాలని తమ ఉత్పత్తులను మధ్య దళారీ వ్యవస్థలకు కాకుండా నేరుగా అమ్ముకునే అవకాశం ఈ ఎఫ్‌పివోలకు ఉంటుందని అన్నారు.
ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విరివిగా ఎఫ్‌పివో చేరి తమ ఆర్థికాభివృద్ది చేసుకోవడానికి ప్రభత్వాలు అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ కొండేలా సాయరెడ్డి, డైరెక్టర్ పాపయ్య, వేల్పూర్ భూమయ్య, నాప్కాన్ జిల్లా అధికారి థామస్ మోడీ, రాజలింగం మాట్లాడారు.
కార్యక్రమంలో పలు తీర్మాణాలు ఆమోదించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పెంటయ్య, జె. భూమారెడ్డి, ఎం. రాజన్న, వెంకట్ రెడ్డి, అఖిల, సాయినాథ్ రెడ్డి, సాయినాథ్, రైతులు పాల్గొన్నారు.