బాన్సువాడ, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గంజాయి మత్తు పదార్థాలను వినియోగించి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎక్సైజ్ ఎస్సై తేజస్విని అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని సాయికిరణ్, రేణుక ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ మత్తుపదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై తేజస్విని మాట్లాడారు.
గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా గంజాయిని ఎవరైనా సాగుచేసిన, విక్రయించిన తమకు కాదు చేయాలని ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. యువత తలచుకుంటే సాధ్యం కానిది ఏది లేదని కావున గ్రామంలో ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసైన వారికి అవగాహన కల్పించాలని, చెడు వ్యసనాలకు లోనైతే జరిగే పరిణామాలను వారికి వివరించాలని ఆమె అన్నారు.
చెడు వ్యసనాలకు యువత తొందరగా ఆకర్షితులవుతారని, కావున యువత గంజాయి, డ్రగ్స్ వినియోగం వైపు వెళ్లకుండా మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని,ఎవరైనా డ్రగ్స్, గంజాయి వినియోగించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆమె అన్నారు. మత్తులో తాము ఏం చేస్తున్నామని సృహ లేకుండా మనం మన జీవితాలను నాశనం చేసుకునే కాకుండా ఇతరుల కుటుంబ సభ్యుల జీవితాలను నాశనం చేసిన వారమవుతమని, కావున చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తమ జీవితాలను అందంగా తీర్చిదిద్దుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్‌ఐ తేజస్వి, సాయి కీర్తి, రేణుక ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ రాజు, గంగాధర్, ఎక్సైజ్ సిబ్బంది షరీఫ్, భోజన్ రావు, విఠల్, అయూబ్, కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.