నిజామాబాద్, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో ఆర్‌అండ్‌బి శాఖ అధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ది పనుల పురోగతిపై మంగళవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మాధవ నగర్, మామిడిపల్లి, అర్సపల్లి ఆర్వొబిల పనుల పురోగతిపై, ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ రోడ్ వర్క్స్ పై సుదీర్ఘంగా చర్చించారు. మోర్తాడ్, కమ్మర్ పల్లి, ఏర్గట్ల, ముప్కాల్ మండల కేంద్రాల్లోని సెంట్రల్ లైటింగ్, రోడ్ వెడల్పు పనులపై మంత్రి ఆరా తీశారు. పనులు వేగంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
భీంగల్ మున్సిపల్ కేంద్రంలో నూతనంగా నిర్మించే ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్ డిజైన్లు పరిశీలించారు.
సమీక్షా సమావేశంలో డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్‌అండ్‌బి సి.ఈ (అడ్మిన్) సతీష్, క్వాలిటీ కంట్రోల్ ఎస్.ఈ పుల్ల దాస్, ఈ.ఈ యుగేందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎస్.ఈ రాజేశ్వర్ రెడ్డి, ఈ.ఈ రమేష్, డి.ఈ రవీందర్ రెడ్డి, ఎ.ఈ నర్సయ్య, ఇరిగేషన్ ఈ.ఈ భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.