డిచ్పల్లి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగాధిపతిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బి. స్రవంతిని వీసీ ఉత్తర్వుల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య నసీం నియమించారు. ఇందుకు గాను నియామక ఉత్తర్వులను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా సోమవారం ఉదయం స్రవంతి అందుకున్నారు.
నిజామాబాద్‌లోనే పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసి, విశ్వద్యాలయంలోని న్యాయ విభాగానికి అధిపతిగా నియమింపబడడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. స్రవంతి ప్రస్తుతం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా ఉన్నారు. గతంలో ఎపిఐఓ, పిఐఓ, నోడల్ ఆఫీసర్, హాస్టల్ వార్డెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.