బి.ఎడ్‌. విద్యార్థులకు గమనిక

డిచ్‌పల్లి, జూన్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. మొదటి, రెండవ, మూడవ, నాల్గవ, సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ / ఇంప్రూవ్‌ మెంట్స్‌ (2017 – 2018 బ్యాచ్‌ విద్యార్థుల కోసం), నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ (2019 బ్యాచ్‌ విద్యార్థుల కోసం) థియరీ పరీక్షలకు ఫీజు గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 23 తేదీ వరకు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

200 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు ఫీజును చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ను సంప్రదించాలన్నారు.

Check Also

ఘనంగా సీతారాముల కళ్యాణం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »