బాన్సువాడ, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పది పరీక్షలకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ తరగతి గదుల్లో ఆకలితో ఇబ్బంది పడకుండా విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
దీనిలో భాగంగా బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల బాన్సువాడలో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని ఉపాధ్యాయులు అందించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విట్టల్ మాట్లాడుతూ విద్యార్థులు ఉదయం వచ్చి సాయంత్రం స్పెషల్ క్లాస్ ముగిసే వరకు అర్ధాకలితో ఉండటం వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం అల్పాహార కార్యక్రమాన్ని ప్రవేశపేట్టడం వల్ల విద్యార్థులుస్నాక్స్ ఇవ్వడంతో కొంత ఉత్తేజం వచ్చి చదువుపై దృష్టి సారిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వై.సత్యనారాయణ, లలితా దేవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.