కామారెడ్డి, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలో యాడవరం గ్రామంలో రైతు వేదికలో రైతుబంధు సమితి క్యాలెండరును మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకం, రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు రైతుభీమా పధకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.
దేశంలోనే తెలంగాణ ప్రభుత్వమేనన్నారు దేశంలోనే రైతుల కోసం సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా రైతువేదికలు నిర్మించారని కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ఆ ఘనత రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సకాలంలో రైతుబంధు, రైతు భీమా అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రభుత్వ విప్ గంప గోవర్థన్‌కు బీబీపేట్ మండల రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్లు వెంకట్రావు, ప్రభాకర్, ఎంపిటిసి లక్కార్స్ రవి, ఉపసర్పంచ్లు హరీష్, శ్రీనివాస్, డైరెక్టర్లు బాపురెడ్డి, విజయ కిషన్ రావు, ఏఈఓ లత, బిఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షులు నర్సింలు, రైబస సభ్యులు, బీఆర్‌ఎస్ శ్రేణులు రాజిరెడ్డి, మద్ద స్వామీ, బ్యాగరి చిన్న శ్రీను, వడ్ల సత్యం, అమృత రెడ్డి, బుజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.