బాన్సువాడ, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లో జరిగే కార్యక్రమానికి బాన్సువాడ డివిజన్‌లోని ఆశ వర్కర్లతో కలిసి సిఐటియు నాయకులు ఖలీల్ తరలివెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశాలను కార్మికులుగా గుర్తించాలని కనీస వేతనం చెల్లించాలని కోరుతూ 16 రోజులు సమ్మె చేయడం జరిగిందని, అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఆశా వర్కర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఆరువేల రూపాయలు వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో ఆశాలకు పదివేల గౌరవ వేతనం అందిస్తూ, ఈఎస్‌ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని వారన్నారు. రాష్ట్రంలో సుమారు 26 వేలమంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనునిత్యం సేవలందిస్తున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఆశ వర్కర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని లేనిచో మార్చ్ ఒకటి రెండు మూడు తేదీల్లో మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు వారు తెలిపారు. ఆశాలపై ఉన్నత అధికారుల వేధింపులను అరికట్టి ఆశాలకు ప్రసుతి సెలవులను ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్, నాయకులు పల్లవి, కవిత, స్వప్న, రమ, ఆశా వర్కర్లు తదితరులు తరలి వెళ్లారు.